మన సింధు గెలుపు మంత్రం ఏమిటో తెలుసా?  - things to know about pv sindhu diet and fitness plans
close
Updated : 02/08/2021 18:25 IST

మన సింధు గెలుపు మంత్రం ఏమిటో తెలుసా? 

టోక్యోకు వందల మంది క్రీడాకారులు వెళ్లినా భారత అభిమానుల కళ్లన్నీ మన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు పైనే. గత ఒలింపిక్స్‌లో రజతం గెల్చిన ఈ షట్లర్‌ ఈసారి కూడా కచ్చితంగా పతకం తెస్తుందని యావత్‌ దేశం విశ్వసించింది. అది పసిడి అయితే మరింత బాగుంటుందని ఆకాంక్షించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ ‘స్వర్ణ’ సాకారం నెరవేరలేదు... కానీ కాంస్య పతకం సాధించి కోట్లాది మంది అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది.

కాంస్యంతో కొత్త చరిత్ర!

బంగారు పతకాన్ని తీసుకురాలేకపోయినా విశ్వక్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది సింధు. సెమీస్‌లో ఎదురైన ఓటమి బాధను అధిగమిస్తూ కాంస్యం కోసం జరిగిన పోరులో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు గెల్చుకున్న మొదటి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఈ ‘రాకెట్‌’కు అలుపు లేదు!

రెండు ఒలింపిక్స్‌ పతకాలు..ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు...కామన్వెల్త్‌ క్రీడలో స్వర్ణం, రజతం, కాంస్యం...ఆసియా గేమ్స్‌లో రజతం, కాంస్యం...వీటికి తోడు ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌, సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌... ఇలా బ్యాడ్మింటన్‌లోనే కాదు... భారత క్రీడారంగంలో మరెవరికీ సాధ్యం కాని అద్భుతమైన విజయాలను అందుకుంది సింధు.

‘సక్సెస్‌ ఈజ్‌ నాట్ ఎ డెస్టినేషన్‌...ఇట్స్ ఎ జర్నీ’ అని ఓ సినిమాలో హీరో చెప్పిన మాటలు ఆమెకు సరిగ్గా సరిపోతాయి. సాధారణంగా ఓ పెద్ద విజయం సాధించగానే ‘ఇక చాలు’ అన్నట్లు చాలామంది సంతృప్తి పడిపోతారు. విజయ గర్వాన్ని తలకెక్కించుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కానీ మన సింధు వీటన్నింటికీ మినహాయింపు. కెరీర్‌లో మరపురాని విజయాలెన్నో సాధించినా కూడా ఎప్పుడూ ఆ మత్తులో ఉండిపోలేదు. ఇంకా పెద్ద లక్ష్యంతో ముందుకు సాగింది.

ప్రపంచ ఛాంపియన్‌గా!

ముఖ్యంగా రియోలో రజతం గెల్చుకున్న తర్వాత సింధు క్రేజ్‌ ఆకాశాన్నంటింది. అయితే ఆమె అక్కడితో ఆగిపోలేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం ప్రణాళికలు వేసుకుంది. అందుకోసం శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా మారింది. వరుసగా రెండేళ్లు రన్నరప్తోనే సరిపెట్టుకున్నా నిరాశ పడలేదు. మొండి పట్టుదలతో పోరాడింది. ఎట్టకేలకు 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది.

ఇక గత ఏడాదిన్నరగా కరోనా కారణంగా టోర్నీలు లేకపోయినా, ప్రాక్టీస్‌ కష్టమైనా... వాటిని సాకుగా ఎంచుకోలేదు. తన శక్తిమేర శ్రమిస్తూ వచ్చింది. టోక్యోలో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది. దురదృష్టవశాత్తూ ఆ అవకాశం అందుకోలేకపోయినా కాంస్యం సాధించింది. ఇలా సింధు శ్రమిస్తున్న తీరు, ఆటలో ఆమె పురోగతిని చూస్తుంటే మరో మూడేళ్లలో రాబోయే ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో తప్పకుండా ‘స్వర్ణ’ సింధును చూస్తామేమో!

సింధు ‘డైట్’ ఇదే!

క్రీడల్లో సుదీర్ఘ కాలం కెరీర్‌ కొనసాగించాలంటే శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. ఫిట్‌నెస్, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మరి నిత్యం ఫిట్‌గా ఉండేందుకు సింధు పాటించే డైట్‌ నియమాలేంటో తెలుసుకుందాం రండి.

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పాలు!

బ్యాడ్మింటన్‌ కోర్టులో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థులను హడలెత్తించే సింధు ప్రొటీన్లు ఉండే ఆహార పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, గుడ్లతో పాటు ఇతర ప్రొటీన్లతో నిండే ఉండే ఆహారం తీసుకుంటుంది. కొన్ని పండ్లను కూడా తన ఫుడ్‌ మెనూలో చేర్చుకుంటుంది. ఇక ట్రైనింగ్‌ సమయానికి వస్తే ఎక్కువ సేపు చురుగ్గా కదిలేందుకు డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకుంటుంది.

రోజూ రెండుపూటలా ‘రైస్’!

సింధు రోజూ రెండుపూటలా భోజనంలో రైస్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటుంది. దీంతో పాటు కొన్ని కూరగాయలు కూడా తీసుకుంటుంది. టోర్నమెంట్ల సమయంలో అయితే అన్నం, చికెన్ తింటుంది. ఎక్కువ సమయం పాటు ట్రైనింగ్‌ సెషన్లలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు అరటి పండ్లు, ప్రొటీన్‌ షేక్స్‌, స్నాక్‌బార్‌లను అందుబాటులో ఉంచుకుంటుంది. ఇవి సాధనలో కోల్పోయిన శక్తిని కూడగట్టుకోవడానికి ఎంతో సహకరిస్తాయంటుందీ బ్యాడ్మింటన్‌ క్వీన్‌. ఇక సింధుకు కావాల్సిన డైట్‌ అంతా ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంటుంది. ఫిట్‌నెస్‌ ప్రణాళికల్లో భాగంగా ప్రతి రెండు నెలలకోసారి రక్త పరీక్షను చేయించుకుంటుందీ బ్యాడ్మింటన్‌ క్వీన్‌. ఈ ఫలితాలను బట్టే తన డైట్ మెనూను సర్దుబాటు చేసుకుంటుంది.

హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం!

ఇక మ్యాచ్‌లు గెలిచిన తర్వాత సింధు అంతకాలం దూరంగా పెట్టిన ఫాస్ట్‌ఫుడ్‌ తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుందట. కేకులు, పేస్ట్రీలు, ఐస్‌క్రీమ్‌, చాక్లెట్లను తింటూ ఎంజాయ్‌ చేస్తుందట. చీట్‌ మీల్స్‌ విషయానికొస్తే హైదరాబాదీ బిర్యానీ తన మెనూలో టాప్ ప్లేస్‌లో ఉంటుందట. ఇక ప్రొఫెషనల్‌ అథ్లెట్లు ఎక్కువగా తీసుకునే నూడుల్స్‌, స్పఘెటీ, పాస్తా (తక్కువ నూనె, కూరగాయలతో చేసినవి)ను కూడా అప్పుడప్పుడూ ఆహారంలో చేర్చుకుంటుంది.

ఎప్పుడూ ‘నో’ చెప్పదు!

సింధు శిక్షణ గురించి ఆమె కోచ్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రీడల్లో కచ్చితంగా పతకాలు తెచ్చే సింధు లాంటి వారికోసం ఓ ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశాం. ఆమె ఆట, బాడీ తీరు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందిస్తాం. ఇందులో భాగంగా వారంలో ఆరు రోజులు, రెండున్నర గంటల పాటు కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది. సింధులోని గొప్పతనమేమిటంటే...శిక్షణ ఎంత కఠినంగా ఉన్నా నవ్వుతూనే సాధన చేస్తుంది. ఎంత బిజీగా ఉన్నా ట్రైనింగ్‌కు మాత్రం ‘నో’ చెప్పదు’ అని చెప్పుకొచ్చారు.

సోదరి వివాహానికి కూడా దూరమైంది!

* తనకిష్టమైన బ్యాడ్మింటన్‌ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది సింధు. ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే బ్యాడ్మింటన్‌లో మెలకువలు నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె రోజూ ఇంటి నుంచి అకాడమీకి మొత్తం 120 కిలోమీటర్లు ప్రయాణించేదట.

* సింధు సోదరి దివ్యకు 2012లో వివాహమైంది. అయితే ఆ సమయంలో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌ ఇండియా గ్రాండ్‌ ప్రిక్స్‌ టోర్నీ కోసం లక్నోలో ఉండిపోయింది సింధు. దీంతో సోదరి పెళ్లిని ప్రత్యక్షంగా చూడలేకపోయిందీ షటిల్‌ క్వీన్.

* 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెల్చుకుంది సింధు. అయితే ఈ పోటీలపై మరింత దృష్టి పెట్టేందుకు, ఏకాగ్రత సాధించేందుకు మొత్తం మూడు నెలల పాటు మొబైల్‌కు దూరంగా ఉండిపోయిందీ హైదరాబాదీ అమ్మాయి.

* టోర్నీలు లేకున్నా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఎక్కువగా స్విమ్మింగ్‌, యోగా, ధ్యానం చేస్తుంటుంది సింధు.

* బ్యాడ్మింటన్‌ ఆట కోసం తన నోరును కూడా కట్టేసుకుందీ యంగ్‌ షట్లర్‌. ఇందులో భాగంగా తనకిష్టమైన హైదరాబాదీ బిర్యానీ, చాక్లెట్స్‌, తియ్యటి పెరుగు, ఐస్‌క్రీం ఇతర ఆహార పదార్థాలను తినడంలో నియంత్రణ పాటిస్తూ వస్తోంది.

భావోద్వేగాల్ని పక్కన పెట్టాను!

‘కాంస్య నెగ్గినందుకు సంతోషపడాలో.. ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం చేజారినందుకు బాధపడాలో తెలియట్లేదు. సెమీస్‌ పరాజయం బాధపెట్టినా కాంస్యం పోరుకు ముందు నా భావోద్వేగాల్ని పక్కనబెట్టా. నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వాలని భావించా. మ్యాచ్‌లో బింగ్జియావో గట్టి పోటీనిచ్చింది. నేను ఓపికగా, ప్రశాంతంగా ఆడా. ఆధిక్యంలో ఉన్నా కూడా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు. నేను బాగా ఆడాననే అనుకుంటున్నా. దేశానికి పతకం అందించడం గర్వంగా ఉంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో మేఘాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. నా కోసం కుటుంబమంతా చాలా కష్టపడింది. ఎన్నో త్యాగాలు చేశారు. వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటా. 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో కచ్చితంగా బరిలో దిగుతా’ అని చెబుతోన్న సింధు మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని ఆశిద్దాం.

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని