మెరిపించే బొప్పాయి!
close
Published : 18/05/2021 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెరిపించే బొప్పాయి!

బొప్పాయి తింటే పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇది జుట్టుకీ మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, చిట్లిన కేశాలకు పోషణనిచ్చి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మరి ఆ పూతలు ఎలా వేసుకోవాలో చూద్దామా...

సెనగపిండి, పెరుగుతో...
మొదట కప్పు ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీంట్లో మూడు చెంచాల పెరుగు, రెండు చెంచాల సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి. షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపుతో కడిగేయాలి. పదిహేను రోజులకోసారి ఈ పూత వేసుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

ఆలివ్‌ నూనెతో...
నాలుగు చెంచాల బొప్పాయి గుజ్జులో రెండు చెంచాల ఆలివ్‌ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. మాడుపై రాసి మృదువుగా మర్దనా చేయాలి. ఓ గంటపాటు జుట్టును అలానే వదిలేయాలి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపుతో కడిగేస్తే సరి. వారంలో ఒకసారి దీన్ని ప్రయత్నించండి. ఈ పూత వల్ల జుట్టుకు పోషణతోపాటు మెరుపూ సొంతమవుతుంది.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని