మొక్కలు పెంచాలనుందా?
close
Published : 18/05/2021 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొక్కలు పెంచాలనుందా?

లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువమంది దృష్టి పెట్టిన వ్యాపకం.. మొక్కల పెంపకం. ఇప్పుడూ దాదాపుగా అలాంటి పరిస్థితే. పైగా వేసవి. కాస్త చల్లదనంతోపాటు మనసుకూ హాయీ కావాలనుకుంటే మీరూ ప్రయత్నించండి.
* సరదాగా మొక్కలు తెచ్చేసుకుని.. తీరా కొద్దిరోజులకే అవి ఎండిపోవడం, చనిపోవడం లాంటివి జరిగితే బాధేస్తుంది. కాబట్టి, తక్కువ రక్షణ అవసరమయ్యే వాటిని ఎంచుకుంటే మేలు. స్పైడర్‌ ప్లాంట్‌, పామ్‌, ఫైకస్‌ లాంటి వాటిని ఎంచుకోవచ్చు. వీటిని ఇంట్లో, ఎండలో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు.
* కొన్ని మొక్కలకు కొద్దిపాటి ఎండ సరిపోతుంది. కొన్నింటికి ఎక్కువ కావాలి. ఎంచుకునేటప్పుడే వివరాలను తెలుసుకుని, దాని ప్రకారం అమర్చుకోవాలి.
* వారానికోసారి ఎండిన పువ్వులు, కాండాలను తుంచడం లాంటివి చేయాలి. కొత్త ఆకులు రావడానికి ఇవి సాయపడతాయి. తెల్లవారుఝాము లేదా సాయంకాలాల్లోనే మొక్కలకు నీటిని పోయాలి. ఒకవేళ మరిచిపోయినా ఎండినట్లుగా అనిపించినా.. స్ప్రే బాటిల్‌తో చిలకరించొచ్చు.
* పువ్వులు ఆనందాన్నిస్తాయి. వేసవి కూడా ఇందుకు లాభిస్తుంది. లిల్లీ, బంతి, బోగన్‌ విలియా, గులాబీ, మల్లె, ట్యూబ్‌ రోజ్‌లను సులభంగా పెంచుకోవచ్చు. సువాసనలు ఒత్తిడినీ దూరం చేస్తాయి. సన్‌ఫ్లవర్‌, ఆర్కిడ్స్‌లనూ ఎంచుకోవచ్చు.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని