Published : 29/10/2021 13:21 IST

Google Safety Tips: పండుగ షాపింగ్ చేస్తున్నారా.. ఈ సేఫ్టీ టిప్స్‌ పాటించండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: గతంలో పండగ సీజన్‌ అంటే అంగళ్లలో సందడి ఉండేది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అంగళ్లు కాస్తా ఆన్‌లైన్‌కి ఎక్కాయి. దీంతో అంగళ్ల సందడి కాస్తా ఆన్‌లైన్ సందడిగా మారిపోయింది. ఇక పండగ సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలు అందించే ఆఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కరోనా పరిస్థితులు నేపథ్యంలో ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. దీంతో యూజర్‌ డేటా, బ్యాంక్‌ ఖాతా వివరాలు లక్ష్యంగా సైబర్‌ దాడులు పెరిగిపోతున్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సైబర్‌ నేరాల సంఖ్య 600 శాతం పెరిగినట్లు అమెరికాకు చెందిన ఓ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే యూజర్స్‌కి గూగుల్ కొన్ని కీలక సూచనలు చేసింది.


పాస్‌వర్డ్‌: గూగుల్ నివేదిక ప్రకారం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 80 శాతం మంది యూజర్స్‌ ఒకే పాస్‌వర్డ్‌ను సుమారు 10కి పైగా సైట్లలో లాగిన్‌ పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారని తెలిపింది. దీనివల్ల యూజర్‌ డేటాను సులువుగా సైబర్‌ నేరగాళ్లు దొంగిలించగలుతున్నారని తెలిపింది. అంటే మాల్‌వేర్ సాయంతో ఒక ఖాతాకు సంబంధించిన వివరాలు తెలిసినా యూజర్‌కు సంబంధించిన మిగిలిన ఖాతాల వివరాలు సులువుగా తెలుసుకోగలరని తెలిపింది. అందుకే ప్రతి ఖాతాకు వేర్వేరు పాస్‌వర్డులు ఏర్పాటు చేసుకోవాలని గూగుల్ సూచిస్తోంది. లేదా పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించాలంటోంది.


సెక్యూరిటీ చెకప్‌: ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఎక్కువ మంది సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్నట్లు తమ నివేదికలో వెల్లడైనట్లు గూగుల్ తెలిపింది. అందుకే మూడు విధాలుగా సెక్యూరిటీ నెట్‌లను ఏర్పాటు చేసుకోవాలని యూజర్స్‌కు సూచిస్తోంది. మొదటిది సెక్యూరిటీ ఫోన్‌ నంబర్‌ లేదా ఇ-మెయిల్ అడ్రస్‌ ఏర్పాటు. అంటే మీ ఖాతాకు సంబంధించిన పాస్‌వర్డ్ ఎంటర్‌ చేసిన తర్వాత మీ ఫోన్ లేదా మెయిల్‌కి ఓటీపీ వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం. రెండోది టూ-స్టెప్ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌. మూడోది తరచుగా గూగుల్ సెక్యూరిటీ చెకప్ చేయడం. ఈ మూడింటినీ తప్పక పాటించాలని గూగుల్ చెబుతోంది.

వెబ్‌సైట్: ఆన్‌లైన్‌ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది ఆఫర్ అనగానే ముందూవెనకా ఆలోచించకుండా దానిపై క్లిక్ చేస్తారు. అది ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌కి రీ-డైరెక్ట్ అవుతుంది. వీటిలో కొన్ని అధీకృత వెబ్‌సైట్లు కాగా మరికొన్ని నకిలీవి ఉంటాయి. మనం షాపింగ్ చేస్తున్న వెబ్‌సైట్ అసలుదా.. నకిలీదా అనేది చెక్ చేసుకోవాలని గూగుల్ సూచిస్తోంది. https ద్వారా బ్రౌజింగ్ చేయడం ఎంతో సురక్షితమైందని గూగుల్ చెబుతోంది. ప్రతి యూజర్ తప్పనిసరిగా తమ బ్రౌజర్లలో https మోడ్‌ని ఎనేబుల్ చేసుకోవాలని తెలిపింది. దానివల్ల మీరు ఓపెన్ చేసిన వెబ్‌సైట్‌కి https అనేది లేకుంటే గూగుల్ వెంటనే యూజర్‌ను అలర్ట్ చేస్తుంది. అలానే యూజర్‌ ఎల్లప్పుడూ లేటెస్ట్ వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగించాలని గూగుల్‌ చెబుతోంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని