Published : 16/09/2021 21:29 IST

Google Pixel 6: కొత్త మొబైల్‌ వస్తోందని.. గూగుల్‌ చిప్స్‌ పంచింది! 

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చేప్పుడు యూజర్స్‌ని ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు విభిన్న మార్గాల్లో ప్రచారం చేస్తుంటాయి. తాజాగా గూగుల్ త్వరలో విడుదల చేయనున్న పిక్సెల్‌ 6 ఫోన్‌ మోడల్‌ ప్రచారం కోసం చేసిన పనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇంతకీ గూగుల్ ఏం చేసిందనేగా మీ సందేహం? అదనేనండీ చిప్స్ పంచిపెడుతోంది. అవును.. గూగుల్ ఒరిజినల్ చిప్స్‌ పేరుతో జపాన్‌లో బంగాళదుంప చిప్స్ పంచిపెట్టింది. పిక్సెల్ 6 ఫోన్‌ ప్రచారంలో భాగంగా 10 వేల చిప్స్ ప్యాకెట్లను ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా యూజర్స్‌కి అందించినట్లు గూగుల్ తెలిపింది. 

ఎందుకిలా?

గూగుల్ గత పిక్సెల్‌ మోడల్స్‌లో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ చిప్‌(ప్రాసెసర్‌)ని ఉపయోగించింది. కొత్తగా తీసుకొస్తున్న పిక్సెల్ 6 మోడల్‌లో గూగుల్ సొంతంగా రూపొందించిన టెన్సర్ చిప్‌సెట్‌ను ఉపయోగించింది. దీనికి సంబంధించిన ప్రచారంలో భాగంగానే ఒరిజినల్ చిప్‌ పేరుతో గూగుల్‌ జపాన్‌ యాడ్‌ని రూపొందించింది. ‘‘మిమ్మలి వెయిట్ చేయించినందుకు సారీ. ఇది వంద శాతం గూగుల్‌దే. ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించాం. అదే గూగుల్ ఒరిజినల్ చిప్‌’’ అంటూ సాగే యాడ్‌లో చిప్స్‌ ప్యాకెట్‌ను యువతి ఫోన్‌లా ఉపయోగిస్తుంటుంది. చివరకు గూగుల్ ఒరిజినల్‌ చిప్‌ ఇక్కడ దొరుకుతుంది అంటూ టెన్సర్‌ చిప్‌సెట్, పిక్సెల్‌ 6 ఫోన్ కనిపిస్తాయి. ఈ యాడ్ చూసిన నెటిజన్లు గూగుల్ జపాన్ ప్రయత్నం విన్నూత్నంగా ఉందంటూ.. పిక్సెల్ పిజ్జా, పిక్సెల్ బర్గర్‌ పేరుతో ఇతర దేశాల్లో కూడా ప్రచారం నిర్వహించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. 


Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని