Published : 14/09/2021 23:55 IST

Youtube Music: గూగుల్ మెటీరియల్‌ డిజైన్‌తో యూట్యూబ్ మ్యూజిక్ విడ్జెట్! 

ఇంటర్నెట్‌డెస్క్: గత కొంత కాలంగా గూగుల్ యాప్స్‌తోపాటు పిక్సెల్‌ ఫోన్‌ యాప్‌లకు మెటీరియల్ డిజైన్‌ పేరుతో కొత్త హంగులు జోడిస్తుంది గూగుల్. దీనిసాయంతో యూజర్స్‌ యాప్‌లో తమకు నచ్చిన విధంగా కలర్‌ మార్చుకోవడం, కాంట్రాస్ట్‌, ఎలిమెంట్ సైజ్‌, లైన్‌ వెడల్పు వంటి వాటిని మార్చుకోవచ్చు. తాజాగా ఈ ఫీచర్‌ని యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌లో కూడా గూగుల్ పరిచయచేయనుందట. ఈ మేరకు యూట్యూబ్ విడ్జెట్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. త్వరలో విడుదలవుతున్న ఆండ్రాయిడ్ 12లో యూట్యూబ్‌ మ్యూజిక్‌ విడ్జెట్‌ను సరికొత్తగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ పరీక్షిస్తున్నట్లు సమాచారం. 

ప్రస్తతం యూట్యూబ్‌ మ్యూజిక్‌ విడ్జెట్‌లో ఆల్బమ్‌ ఆర్ట్, మీడియా కంట్రోల్స్‌, లైక్‌, డిస్‌లైక్‌ బటన్‌ ఉంటాయి. గూగుల్ కొత్తగా తీసుకురానున్న విడ్జెట్‌లో చుట్టూ లైన్‌, దానికి నాలుగు వైపులా నాలుగు సర్కిల్స్‌ ఉంటాయి. విడ్జెట్‌ మధ్యలో సర్కిల్ డిజైన్‌ ఉంటుందట. అందులో యూట్యూబ్‌ మ్యూజిక్‌ లోగో ఇస్తున్నారని సమాచారం. అలానే సర్కిల్ కుడివైపు పైన లైక్‌ బటన్‌, ఎడమవైపు కింద ప్లే బటన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేతరహా  విడ్జెట్‌ని జీమెయిల్, గూగుల్ క్యాలెండర్‌, మీట్‌, డ్రైవ్‌, డాక్స్‌, షీట్స్‌, స్లైడ్స్‌ యాప్‌లలో కూడా పరిచయం చేయనున్నారట.  ప్రస్తుతం మెటీరియల్‌ డిజైన్‌ను గూగుల్ ట్రాన్స్‌లేట్, గూగుల్ లెన్స్‌, గూగుల్ మెసేజెస్‌ యాప్‌లలో పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్లను త్వరలోనే విడుదలచేయనున్న ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌లో పరిచయం చేస్తారని టెక్ వర్గాలు తెలిపాయి. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని