Updated : 03/11/2021 14:40 IST

SMS Apps: ఈ యాప్‌లు డౌన్‌లోడ్ చేశారా.. ఖాతాలు ఖాళీ..ఎలాగంటే! 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల గూగుల్ 151కి పైగా యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి డిలీట్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో కీబోర్డ్‌, కెమెరా ఫిల్టర్‌, ఎస్సెమ్మెస్‌ వంటి వాటితోపాటు వివిధ కేటగిరీలకు చెందిన యాప్‌లు ఉన్నాయి. ఇంతకీ గూగుల్ ఈ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి ఎందుకు డిలీట్ చేసింది? వీటి గురించి సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అవాస్ట్ 82 ఏం చెబుతోంది? వీటి సాయంతో సైబర్‌ నేరగాళ్లు ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో తెలుసుకుందాం. 

* ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌లను సుమారు 10.5 మిలియన్ మంది యూజర్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు యూజర్స్‌ ఫోన్ల నుంచి ప్రీమియం ఎస్సెమ్మెస్‌ సేవలకు సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్లు గుర్తించామని అవాస్ట్‌ 82 సంస్థ వెల్లడించింది. 

* కెమెరా ఫిల్టర్‌, గేమింగ్‌, వీడియో/ఫొటో ఎడిటింగ్‌, కీబోర్డ్‌, క్యూఆర్‌ కోడ్ స్కానింగ్, స్పామ్‌ కాల్స్‌ బ్లాకింగ్.. వంటి వివిధ కేటగిరీలకు చెందిన యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసేందుకు ఒకేరకంగా..ఒకే రకమైన ఫీచర్స్‌తో ఉన్నట్లు తెలిపింది. దీంతో యూజర్స్‌ సులువుగా వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు గూగుల్‌కు సమర్పించిన నివేదికలో అవాస్ట్‌ 82 పేర్కొంది. 

* ఈ యాప్‌ల ద్వారా ముందుగా యూజర్స్‌ ఫోన్లలోకి మాల్‌వేర్‌ని పంపుతారు. తర్వాత వారి లొకేషన్‌, వ్యక్తిగత సమాచారం, ఫోన్ ఐఎమ్‌ఈఐ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలు తెలుసుకుంటున్నారట. యూజర్‌ యాప్‌ ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ నంబర్‌ లేదా ఈ-మెయిల్ వంటి వివరాలు నమోదు చేయమని సూచిస్తుంది. అలా చేస్తేనే యాప్‌ ఉపయోగించుకునేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో తప్పనిసరిగా వాటిని టైప్ చేస్తారు. వాటి సాయంతో యూజర్‌ మొబైల్‌ ఫోన్‌లోని ప్రవేశించి ప్రీమియం ఎస్సెమ్మెస్ సేవలకు చెల్లింపులు చేసి వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకుంటారని అవాస్ట్‌ 82 తెలిపింది.

* ఈ సేవలను పొందినట్లు యూజర్‌కి ఎలాంటి నోటిఫికేషన్ కూడా రాదు. అయితే ఎస్సెమ్మెస్‌ సేవలకు చెల్లించిన నగదు సదరు యూజర్‌ ఫోన్‌ బిల్లులో కనిపిస్తుంది. ఒక్కోసారి యూజర్స్‌ ఫోన్ నంబర్‌కి అనుసంధానించిన బ్యాంక్‌ ఖాతా నుంచి కూడా నగదు చెల్లింపులు జరుగుతున్నట్లు గుర్తించామని అవాస్ట్ 82 వెల్లడించింది. 

* ఒకవేళ యూజర్స్‌ సదరు యాప్‌ని డిలీట్ చేసినా వారి ఫోన్‌ బిల్లు లేదా బ్యాంక్‌ ఖాతా నుంచి చెల్లింపులు జరుగుతూనే ఉంటాయని తెలిపింది. వీటిని గుర్తించిన వెంటనే యూజర్స్‌ సదరు లావాదేవీలకు సంబంధించిన చెల్లింపులను రద్దు చేయించాలని సూచించింది. 

* అవాస్ట్ సంస్థ నివేదిక ప్రకారం ఈ యాప్‌లను ఎక్కువగా యూఏఈ, ఈజిప్టు, సౌదీ అరేబియా, పాకిస్థాన్‌, అమెరికా, పోలండ్ వంటి దేశాల్లోని యూజర్స్‌ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట. భారత్‌లో కూడా కొంతమంది యూజర్స్ ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని