Sachin: ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను: తెందూల్కర్‌ 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన అభిమానులకు మంచి సందేశం ఇచ్చాడు. చెట్లను నాటి ఈ ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చాడు...

Updated : 05 Jun 2021 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తన అభిమానులకు మంచి సందేశం ఇచ్చాడు. చెట్లను నాటి ఈ ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చాడు. కాలుష్యంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ నేలతల్లిని తమవంతుగా బాగుచేయాలని కోరాడు. ఈ క్రమంలోనే అతడు కూడా తన వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు నాటి మొక్కలను పెంచాడు. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఈ విత్తనాలు మొక్కలుగా పెరగడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నమ్మశక్యం కానిది. దీనివల్ల చాలా ఆనందం పొందాను. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను’ అని పేర్కొన్నాడు. ‘మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ప్రకృతి నిరంతరాయంగా పనిచేస్తుంది’ అని వ్యాఖ్యానం జతచేశాడు. సచిన్‌తో పాటు పలు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు సైతం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టులు చేశాయి. కాలుష్య కారకాల నుంచి ఈ భూమాతను కాపాడాలని వారంతా అభిమానులను కోరారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని