IND vs DERBY : హుడా మళ్లీ దడ.. దడా

దీపక్‌ హుడా మెరుపు ఇన్నింగ్స్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఐర్లాండ్‌తో

Published : 03 Jul 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపక్‌ హుడా మెరుపు ఇన్నింగ్స్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఐర్లాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో  47*(29), 104(57)పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. కాగా, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా యువ భారత్‌ శుక్రవారం డెర్బిషైర్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో హుడా మరోసారి రెచ్చిపోయాడు. 37 బంతుల్లోనే 2 సిక్సర్లు, 5 ఫోర్ల సహాయంతో 59 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలిత బ్యాటింగ్‌ చేసిన  డెర్బిషైర్‌ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు నష్టానికి 150 పరుగులు చేసింది. ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌ తలో రెండు వికెట్లు తీసి కట్టడి చేశారు.

అనంతరం బ్యాటింగ్‌ దిగిన భారత్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(3) వికెట్‌ కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్‌, శాంసన్‌(38), సూర్యకుమార్‌(36)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. విజయానికి 17 పరుగులు దూరంలో హుడా ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్‌, సూర్యతో కలిసి మిగిలిన పని పూర్తి చేశాడు. దీంతో యువ భారత్‌ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నార్తాంప్టన్‌షైర్‌తో యువ భారత్‌ ఆదివారం మరో టీ20 వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని