Supreme Court: కొవిడ్‌ పరిహారం చెల్లింపుల్లో జాప్యం.. ఏపీపై సుప్రీం అసహనం

కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాలపై అత్యున్నత న్యాయస్థానం అసహనం తెలిపింది.

Published : 19 Jan 2022 11:38 IST

బిహార్‌పై కూడా.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు సమన్లు

దిల్లీ: కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాలపై అత్యున్నత న్యాయస్థానం అసహనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ, బిహార్‌ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 2గంటలకు హాజరవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని