Sundar Pichai: సరదాగా మాట్లాడుకున్న పిచాయ్, డిస్నీ ఫ్రాగ్..!

ప్రపంచం దృష్టి సారించాల్సిన సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పు అంశాలపై గూగుల్ సీఈఓ సందర్‌ పిచాయ్‌ యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో డిస్నీకి చెందిన కెర్మిట్ ది ఫ్రాగ్, ఆయనకు మధ్య జరిగిన సరదా సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వారిద్దరు సరదాగా స్పందించి, సందేశమిచ్చారు. డియర్ ఎర్త్ పేరిట యూట్యూబ్ ఈ కార్యక్రమం నిర్వహించింది.

Updated : 28 Oct 2021 15:14 IST

ప్రపంచం దృష్టిసారించాల్సిన సమస్యలపైనే వారి చర్చ

వాషింగ్టన్‌: ప్రపంచం దృష్టి సారించాల్సిన సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులపై గూగుల్ సీఈవో సందర్‌ పిచాయ్‌ యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో డిస్నీకి చెందిన కెర్మిట్ ది ఫ్రాగ్, ఆయనకు మధ్య జరిగిన సరదా సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వారిద్దరు సరదాగా స్పందించి, సందేశమిచ్చారు. డియర్ ఎర్త్ పేరిట యూట్యూబ్ ఈ కార్యక్రమం నిర్వహించింది. 

ఫ్రాగ్‌: హాయ్ సుందర్. (ఆ తర్వాత  సుందర్ మాట్లాడుతున్నప్పటికీ.. ఆయన మాటలేవీ వినిపించలేదు.) 

ఫ్రాగ్‌: సుందర్, మీ డివైజ్‌ మ్యూట్‌లో ఉన్నట్లుంది. అది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. 

పిచాయ్‌: సారీ కెర్మిట్. నా డివైజ్‌ మ్యూట్‌లో ఉండిపోయింది. నేను నీకు పెద్ద ఫ్యాన్‌. నీతో మాట్లాడటం చాలా బాగుంది.

ఇలా సరదాగా మాట్లాడుతూ.. సుస్థిరాభివృద్ధి, వాతావరణ సమస్యలు వంటి సీరియస్ అంశాలపై చర్చించారు. చివరగా తాను గూగుల్‌లో వెతికి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, ఈ భూమి మీద 8,384 ఉభయచరాలు ఉన్నాయని ఫ్రాగ్ చెప్పింది. అలాగే వాటి పేర్లను చెప్పడం మొదలు పెట్టింది. వెంటనే పిచాయ్ కలుగజేసుకొని.. ఆ జాబితాలో ఉన్న పేర్లను తర్వాత పూర్తి చేద్దామా..? అంటూ దాని నోరు సరదాగా మూయించారు. ఆయన ట్విటర్ వేదికగా వారి సంభాషణ వీడియోను షేర్ చేశారు. ‘మన డివైజ్‌ అన్‌మ్యూట్ చేయాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మా డియర్ ఎర్త్‌లో భాగమైనందుకు కెర్మిట్ ది ఫ్రాగ్‌కు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు. ఈ డియర్ ఎర్త్ కార్యక్రమంలో వేగంగా సంభవిస్తోన్న వాతావరణ మార్పులకు  అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా చర్చ జరిగింది. దీనిలో పర్యావరణ పరిరక్షకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని