logo

నకిలీ పోలీసు అరెస్టు

పోలీసునని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్‌ జిల్లా దొంగను కామారెడ్డి జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో

Published : 24 Jan 2022 05:28 IST

అంతర్‌ జిల్లా దొంగగా గుర్తింపు


సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, చిత్రంలో ఏఎస్పీ అన్యోన్య,
డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్‌, ఎస్సైలు రాముల, మధుసూదన్‌గౌడ్‌

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసునని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఓ అంతర్‌ జిల్లా దొంగను కామారెడ్డి జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌ కాలనీలో బొజ్జ విష్ణు అలియాస్‌ పోశెట్టి అలియాస్‌ పోషర్ది అనే యువకుడు నివసిస్తున్నాడు. శనివారం ఉదయం అశోక్‌నగర్‌ కాలనీలో ఓ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న నిడుకొండ పోశెట్టి అనే వ్యక్తిని ద్విచక్రవాహనంపై వెళ్లి ఆపాడు. తాను మఫ్టీలో ఉన్న పోలీసునని బెదిరించాడు. పోశెట్టి వద్ద ఉన్న రూ.2800 బలవంతంగా లాక్కొని పారిపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టణ సీఐ నరేష్‌ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న విష్ణును పట్టుకొని విచారించగా.. దొంగతనం చేసిన విషయం అంగీకరించాడు. అతని వద్ద రూ.2500తో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించనున్నట్లు ఎస్పీ వివరించారు. గతంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, బోయిన్‌పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కామారెడ్డి జిల్లా దేవునిపల్లి తదితర పోలీసుస్టేషన్ల పరిధిలో ఇదే తరహా దొంగతనాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని