logo

కేజీబీవీల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌

జిల్లాలోని కేజీబీవీల్లో 2021- 22 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి షెడ్యూల్‌ విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ మేకతోటి వెంకటప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 8వ తేదీ వరకు

Published : 06 Dec 2021 02:56 IST

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: జిల్లాలోని కేజీబీవీల్లో 2021- 22 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి షెడ్యూల్‌ విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ మేకతోటి వెంకటప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 8వ తేదీ వరకు ఉంటుందని, దరఖాస్తుల పరిశీలన 9, 10 తేదీల్లో ఉంటుందని, ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ 11న, అప్పీల్స్‌ 14వ తేదీ వరకు, తుది మెరిట్‌ జాబితా 16న ఉంటుందన్నారు. డిసెంబరు 18న కౌన్సెలింగ్‌, నియామక ఉత్తర్వులు ఉంటాయని తెలిపారు. ప్రిన్సిపల్‌ పోస్టులు 4, కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్స్‌(సీఆర్‌టీ) ఆంగ్లం 3, భౌతికశాస్త్రం 4, జీవశాస్త్రం 1, సాంఘికశాస్త్రం 4, పీఈటీ 5, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) తెలుగు 2, జీవశాస్త్రం 1, రసాయన శాస్త్రం 1, కంప్యూటర్స్‌ 1, అకౌంట్స్‌ 1 చొప్పున పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హత గల స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు ఇతర వివరాలకు https://samagrashikshaguntur.blogspot.com/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని