logo

వరికపూడిశెల కార్యరూపం దాల్చేలా కృషి

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర దిశ కమిటీ కేంద్ర ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సహకరిస్తామన్నారు.

Published : 06 Dec 2021 02:56 IST

సమావేశంలో పాల్గొన్న ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర దిశ కమిటీ కేంద్ర ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సహకరిస్తామన్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ అతిథిగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారుల ప్రతిప్రాదనలు త్వరితగతిన పూర్తిచేసేలా కేంద్రంతో చర్చించామన్నారు. నరసరావుపేటకు నలువైపులా రోడ్లు, రైల్వే లైను కనెక్టివిటీ ఉండేలా కృషి చేస్తానని చెప్పారు. గుంటూరు- వినుకొండ వయా నరసరావుపేట మార్గం నాలుగు లైన్ల రహదారిగా మార్చనున్నామని తెలిపారు. పిడుగురాళ్ల- నరసరావుపేట, నరసరావుపేట- సత్తెనపల్లి రహదారులను విస్తరించనున్నామని వివరించారు. నరసరావుపేట- నకరికల్లు మధ్య రూ.237 కోట్లతో రైల్వే లింక్‌ లైన్‌ నిర్మించాలని ఆ శాఖ మంత్రి, ఛైౖర్మన్‌లకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. నరసరావుపేటలో కృషి విజ్ఞాన్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపిస్తే నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. పార్టీ నేతలు నలబోతు వెంకట్రావు, వల్లెపు కృపారావు,  కర్ణ అమర సైదారావు, రంగిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని