logo

ఉరేసుకొని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కృష్ణా జిల్లా చందర్లపాడు పోలీస్‌ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడకుదుటి శివనాగేశ్వరరావు స్థానిక మేనకా స్టూడియో బజారులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం

Published : 06 Dec 2021 01:35 IST

శివనాగేశ్వరరావు (పాత చిత్రం)

పామర్రు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా చందర్లపాడు పోలీస్‌ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడకుదుటి శివనాగేశ్వరరావు స్థానిక మేనకా స్టూడియో బజారులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌.ఐ. అవినాష్‌ తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష కోసం గుడివాడ ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు. అనుమానాస్పంద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని