ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ ఇష్యూ శ్రేణి రూ.166-175

చెల్లింపు సేవల సంస్థ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ తన పబ్లిక్‌ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.166-175గా నిర్ణయించింది. జనవరి 19న మొదలై 21న ముగిసే ఈ ఐపీఓలో యాంకర్‌ ఇన్వెసర్లు ఒక రోజు ముందుగానే (18న) బిడ్డింగ్‌

Published : 15 Jan 2022 04:44 IST

చెల్లింపు సేవల సంస్థ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ తన పబ్లిక్‌ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.166-175గా నిర్ణయించింది. జనవరి 19న మొదలై 21న ముగిసే ఈ ఐపీఓలో యాంకర్‌ ఇన్వెసర్లు ఒక రోజు ముందుగానే (18న) బిడ్డింగ్‌ వేయడానికి అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది. తొలుత రూ.800 కోట్లు సమీకరించాలని కంపెనీ భావించినా.. తర్వాత రూ.680 కోట్లకు ఇష్యూ పరిమాణాన్ని  తగ్గించుకుంది. ఈ ఇష్యూ పూర్తిగా ప్రమోటర్లు, ఇతర వాటాదార్లు చేపడుతున్న ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మాత్రమే. అంటే ఈ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులు వారికి చేరతాయి కాని కంపెనీకి కాదు. ప్రమోటరు రవి బి గోయల్‌ ఒక్కరే రూ.677.58 కోట్ల వరకు విలువైన షేర్లను విక్రయించనున్నారు. అంతక్రితం రూ.792 కోట్ల విలువైన షేర్లను అమ్మాలని భావించారు. ఇష్యూలో సగం సంస్థాగత మదుపర్లకు కేటాయించగా.. 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు; మిగిలిన 35 శాతం రిటైల్‌ మదుపర్లకు కేటాయించారు. మదుపరులు కనీసం 85 షేర్లకు బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని