Akash Ambani: టైమ్స్‌ 100 వర్థమాన నాయకుల జాబితాలో ఆకాశ్‌ అంబానీ

అమెరికా న్యూస్‌ మ్యాగజీన్‌ టైమ్స్‌, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది వర్థమాన నాయకులతో రూపొందించిన జాబితాలో రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (30) చోటు

Updated : 29 Sep 2022 08:28 IST

దిల్లీ: అమెరికా న్యూస్‌ మ్యాగజీన్‌ టైమ్స్‌, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది వర్థమాన నాయకులతో రూపొందించిన జాబితాలో రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. ‘టైమ్‌ 100 నెక్ట్స్‌’ జాబితాలో స్థానం పొందిన భారతీయుడు ఆయన ఒక్కడే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడైన ఆకాశ్‌ అంబానీని జియో ఛైర్మన్‌గా ఈ ఏడాది జూన్‌లో నియమించిన సంగతి విదితమే. 22 ఏళ్లకే ఆయన కంపెనీ బోర్డులో చేరి, ఇప్పుడు పూర్తిస్థాయిలో సంస్థను నిర్వహిస్తున్నారు. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్‌, సమాజసేవలో ఉన్న 100 మంది వర్థమాన నాయకులను టైమ్స్‌ ఈ జాబితాలో చేర్చింది. భారత సంతతికి చెందిన అమెరికన్‌ ఓన్లీఫ్యాన్స్‌ అధిపతి ఆమ్రపాలి గన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని