Variety Food: వీటిని చూడొచ్చు.. ఆ‘పై’ తినేయొచ్చు! - Sunday Magazine
close

Variety Food: వీటిని చూడొచ్చు.. ఆ‘పై’ తినేయొచ్చు!

వంటలు రుచిగా చేస్తే ‘చాలా బాగా చేశారే’ అంటూ మెచ్చుకుంటాం. మరి రుచితోపాటూ అవి కనువిందు చేసేంత అందంగా ఉంటే ‘సూపర్‌’ అనకుండా ఉంటామా! అమెరికాకు చెందిన ఫుడ్‌ ఆర్టిస్ట్‌ లిజ్‌ జాయ్‌ ‘నరేటివ్‌ పై’ పేరుతో చేసిన ఈ బేకింగ్‌ పదార్థాలతో అలాగే పేరు తెచ్చుకుంది. సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన జాయ్‌, పిండితోనే అందమైన రూపాలుగా మలిచి చేసే ‘పై’ని కాస్త వెరైటీగా చేయాలనుకుంది. భిన్నంగా ఆలోచించి పిల్లల పుస్తకాల్లోని ఫెయిరీ టేల్స్‌ సన్నివేశాలూ, కార్టూన్‌ సినిమాల్లోని పాత్రల చిత్రాలతో నోరూరించే పదార్థాలు చేయడం మొదలుపెట్టింది. కాగితమూ, రకరకాల అచ్చుల సాయంతో ఎంచుకున్న బొమ్మకు తగ్గట్టుగా పిండిని చందమామా, నక్షత్రాలూ, అమ్మాయిల ఆకారాల్లా తీర్చిదిద్దుతుంది జాయ్‌. ఆ తర్వాత చాకొలెట్లూ, ఫుడ్‌ కలర్‌లూ వాడుతూ అద్భుతమైన చిత్రాల్లా చేసి బేక్‌ చేస్తుంది. అలా పెయింటింగ్‌లా కనిపించే ‘పై’ తయారైపోతుంది. ఈమె కళను అందరూ మెచ్చుకోవడంతో ‘ఇన్‌స్పైర్డ్‌ టు టేస్ట్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని ప్రారంభించింది. ఇంకేముంది, నోరూరిస్తూనే కథలు చెప్పేస్తున్నట్టుండే ఆమె ఫుడ్‌ ఆర్ట్‌ బాగా ఫేమస్‌ అయిపోయింది.

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న