48 ఏళ్ల తర్వాత తిరిగిచ్చాడు! - Sunday Magazine
close

48 ఏళ్ల తర్వాత తిరిగిచ్చాడు!

హాయో లైబ్రరీకి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఒక పార్శిల్‌ కవరొచ్చింది. తెరిచి చూస్తే అందులో అమెరికన్‌ సింగర్‌ బాబ్‌ డైలాన్‌ రికార్డు, దాంతోపాటు ఒక ఉత్తరం కనిపించాయి. అది చదివి లైబ్రరీ వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారట. ఎందుకంటే పార్శిల్‌లో వచ్చిన పుస్తకాన్ని హోవార్డ్‌ సైమన్‌ అనే ఆయన 1973లో విద్యార్థిగా ఉన్నప్పుడు తీసుకుని లైబ్రరీకి తిరిగివ్వలేదు. 48 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు... సైమన్‌ ఆ రికార్డును పంపి, ‘ఇన్నాళ్లూ పనిలో పడి ఇవ్వడం మరిచిపోయా. ఆలస్యంగా ఇస్తున్నందుకు మన్నించండి, దాదాపు 17,480 రోజుల తర్వాత మీ రికార్డును పంపుతున్నా’ అని ఉత్తరంలో రాసి దాంతో పాటు జరిమానా కింద 175 డాలర్లు పంపాడట. ‘క్షమాపణలూ, ఫైన్లూ కాదు గానీ ఇంతకాలానికైనా రికార్డుని తిరిగివ్వడం మంచి విషయం’ అని లైబ్రరీవాళ్లు సంతోషిస్తున్నారట.

కుక్కలంటే ఎంత ప్రేమో...

హారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రంజిత్‌ నాథ్‌ రోజూ మధ్యాహ్నం వంట మొదలుపెట్టి ఓ పాత్ర నిండా బిర్యానీ వండుతాడు. సాయంత్రంకాగానే ఆ బిర్యానీ పాత్రను తీసుకుని బైక్‌ మీద బయలుదేరుతాడు... అమ్మడానికి కాదు, కుక్కల కోసం. ఈ కరోనా కష్టకాలంలో వీధుల్లో ఉండే కొందరు జనాలే సరైన ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటే, ఇక వీధికుక్కల సంగతి చెప్పనక్కర్లేదు. ‘మనుషులకైతే కొందరైనా సాయం చేస్తుంటారు. పాపం... కుక్కల్ని ఎవరు పట్టించుకుంటారు’ అనుకున్న రంజిత్‌ రోజూ వీధులన్నీ తిరుగుతూ దాదాపు 200 కుక్కలకు ఆహారం అందిస్తున్నాడు. ఈయన జంతుప్రేమను చూసినవారు మెచ్చుకోకుండా ఉండగలరా!

రూ.850 కోట్ల టీకా లాటరీ!

రోనా మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రపంచమంతటా టీకాలు వేస్తున్నట్లే అమెరికాలోని కాలిఫోర్నియాలోనూ వేస్తున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం ‘రండి బాబూ రండీ కరోనా టీకా వేయించుకోండి. ప్రైజ్‌మనీ కొట్టేయండి’ అంటూ ఏకంగా 116.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.850కోట్లు) నగదు బహుమతిని ప్రకటించింది. అంతమందిలో ఆ అదృష్టం ఏ ఒక్కరి సొంతమో కాదండోయ్‌... లక్కీ డ్రాలో మొదటి పది మందికి 1.5 మిలియన్‌డాలర్లు (దాదాపు రూ.11కోట్లు), తర్వాత 30 మందికి 50,000 డాలర్లు(దాదాపు రూ. 36లక్షలు) ఇంకా 20 లక్షల మందికి 50 డాలర్ల(రూ.3600) చొప్పున ప్రైజ్‌ మనీ వస్తుంది. 12 ఏళ్లు దాటిన వారంతా టీకా తీసుకోవాలని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసినా జనాభాలో 63 శాతం మందే వేయించుకున్నారట. మిగిలిన వారందరూ కూడా వేసుకోవాలనే ఈ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఆ లక్కీ విన్నర్స్‌ ఎవరో మరి!

కారు పార్కింగ్‌కి రూ.9.5 కోట్లు!

హాంకాంగ్‌లో మౌంట్‌ నికల్సన్‌ అనే ఖరీదైన ప్రాంతమొకటి ఉంది. అక్కడ ఇళ్లు కట్టుకోవడమంటే మాటలు కాదు, ఎందుకంటే గజం ధర లక్షల్లో ఉంటుంది. అయితే ఈమధ్య ‘వార్ఫ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ అండ్‌ నన్‌ ఫంగ్‌ గ్రూప్‌’ వాళ్లు తమ 135 చదరపు అడుగుల స్థలాన్ని 1.3 మిలియన్‌ డాలర్లకు(దాదాపు 9.5 కోట్లు) అమ్మేశారు. ‘ఇందులో ఏముందీ, మన దగ్గరా కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకూ ఇంతకన్నా ఎక్కువ ధరలుంటాయిగా’ అని తీసిపారేయకండి. ఎందుకంటే వాళ్లు అమ్మింది ఇంటి స్థలాన్నో, కట్టిన భవంతినో కాదండీ, కారు పార్కింగ్‌ స్థలం. ఇప్పుడది ‘ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన పార్కింగ్‌ ప్లేస్‌’గా పేరుతెచ్చుకుంది. అదండీ సంగతి!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న