
ప్రధానాంశాలు
ఇంటర్ బోర్డు ఉద్యోగుల విభజన ప్రక్రియపై హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా వివిధ సంస్థల ఆస్తులు, అప్పుల విభజనలో జరుగుతున్న జాప్యంపై సోమవారం తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ చట్టంలోని షెడ్యూలు 9, 10లో అందులో చాలా సంస్థలుంటాయని, ఒక సంస్థకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా అన్ని కేసుల్లోనూ వాయిదా కోరితే ఎలాగని ప్రశ్నించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ బోర్డుల ఉద్యోగుల విభజన చేయకపోవడాన్ని సవాలు చేస్తూ సూపరింటెండెంట్లు ఎస్.సావిత్రి, కె.వెంకటేశ్వరరావు, జి.వెంకటరావులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది రాధీవ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బోర్డుకు చెందిన ఉద్యోగుల విభజనకు కొంత గడువు కావాలని కోరారు. విభజనకు సంబంధించి మరో కేసులో ఇదే కోర్టు మూడు నెలల గడువు ఇచ్చిందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఒక సంస్థకు సంబంధించి ఇచ్చిన గడువును మరో సంస్థకు వర్తింపజేయడంపై ప్రశ్నించింది. ప్రతి సంస్థా ఇలాగే గడువు కోరితే ఎలాగంది. రెండు రాష్ట్రాల బోర్డు అధికారులు పరస్పర అవగాహనతో పరిష్కరించుకుంటే సరిపోతుందని, దీనికి ప్రభుత్వాలతో పనేంటని ప్రశ్నించింది. ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని పేర్కొంది. ఎలాంటి ఉద్వేగాలు లేని ఏలియన్స్‌లా వ్యవహరిస్తే ఎలాగంది. కోర్టులు పరిష్కరిస్తాయంటూ పట్టనట్టు వ్యవహరిస్తున్న ఇరురాష్ట్రాల బోర్డు అధికారుల తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. ఇలాగే వ్యవహరిస్తే భారీగా జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉద్యోగుల పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- వనస్థలిపురంలో కారు బీభత్సం
- అమెరికా అప్పెంతో తెలుసా?
- కిమ్ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి