TS NEWS: తెలంగాణలో భూముల అమ్మకం
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 06:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS NEWS: తెలంగాణలో భూముల అమ్మకం

హైదరాబాద్‌: నిధుల సమీకరణ కోసం భూములను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం .. అందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మంత్రివర్గం నిర్ణయం మేరకు వివిధశాఖల వద్ద ఖాళీగా ఉన్న  భూముల అమ్మకానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల  విక్రయం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. భూములు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ కమిటీలను ప్రభుత్వం నియమించింది.  న్యాయపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ల్యాండ్స్‌ కమిటీని ఏర్పాటు చేశారు. భూముల విక్రయ అనుమతుల కోసం అప్రూవల్‌ కమిటీ, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నోడల్‌ శాఖ భూమి ధరను నిర్ణయించి ఈ-వేలం ప్రక్రియ ద్వారా పారదర్శకంగా విక్రయించనుంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన స్టీరింగ్‌ కమిటీ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది. రెవెన్యూ, గృహనిర్మాణశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక, పురపాలక, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

భూములు కొనుగోలు చేసిన వారు ఎలాంటి నిర్మాణాలైన చేపట్టేందుకు వీలుగా ఆ భూములను మల్టీపర్పస్‌ జోన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇతర భవన నిర్మాణ అనుమతులన్నీ నిబంధనల ప్రకారం సత్వరం మంజూరయ్యే విధంగా టీఎస్‌ బీపాస్‌ విధానం ద్వారా సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ ఆన్ లైన్ ప్లాట్ ఫాం ద్వారా ఈ-వేలాన్ని నిర్వహిస్తారు. భూముల కనీస ధరను నిర్ణయించడం, ఈ-వేలం షెడ్యూల్ ప్రకటన, మార్కెటింగ్, కన్సల్టెంట్ల సేవల వినియోగం, బిడ్ల ఆమోదం తదితరాలను నోడల్ ఏజెన్సీ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ-వేలం ద్వారా భూమిని పొందిన వారికి డబ్బులు చెల్లించిన ఏడు రోజుల్లోగా జిల్లా కలెక్టర్ భూమిని రిజిస్టర్ చేసి అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశ్రమల శాఖ తరపున ఉత్తర్వులు జారీ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని