
రూ.91 లక్షలు విలువ చేసే బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.91 లక్షలు విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు. నిన్న రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి అధికారులు 1,867 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.91 లక్షలు ఉంటుందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags :