
అన్నవరం దేవస్థానానికి ప్రత్యేక శోభ
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం పుష్ప సోయగంతో కొత్త శోభ సంతరించుకుంది. మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భీష్మ ఏకాదశి విశిష్టత తెలిసేలా ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన కటౌట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయంలో అనివేటి మండపం వద్ద సత్య దేవుడు, అనంతలక్ష్మి అమ్మవారు, పరమేశ్వరులను తీర్చిదిద్దారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు ఉత్సాహంగా స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు.
Tags :