AP News: ఆర్యవైశ్య సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు: మంత్రి వెల్లంపల్లి
eenadu telugu news
Updated : 28/10/2021 17:09 IST

AP News: ఆర్యవైశ్య సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు: మంత్రి వెల్లంపల్లి

అమరావతి: ఆర్యవైశ్య సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కేబినెట్‌ సమావేశం అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. శారదాపీఠానికి భూమి కేటాయిస్తే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మం కాపాడుకునేందుకు, వేద పాఠశాల నిర్మాణం కోసం శారదా పీఠానికి భూమి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అనంతపురంలో గణపతి సచ్ఛిదానంద స్వామి ఆశ్రమానికి 17 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అన్నింటిలోనూ రాజకీయాలు చేయొద్దని తెదేపాకి సూచించారు. తెదేపా హయాంలో ఈషా ఫౌండేషన్‌కు కూడా భూమి ఇచ్చారని గుర్తు చేశారు. ధర్మాన్ని కాపాడేవారికి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఆర్యవైశ్య సత్రాల్లో భక్తులకు ఆశ్రయం కల్పిస్తారని, అన్నదాన సదుపాయం ఉంటుందని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని