ఆదాయం ఆర్జించేలా చర్యలు
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

ఆదాయం ఆర్జించేలా చర్యలు

సమావేశంలో జోన్‌ ఛైర్‌పర్సన్‌ పద్మావతి, అధికారులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ పరిధిలోని ఖాళీ ప్రదేశాలు, ఉపయోగించని బస్టాండ్‌లను గుర్తించి వాణిజ్య పరంగా వినియోగించి ఆదాయం ఆర్జించేలా చర్యలు చేపట్టాలని విజయవాడ జోన్‌ ఛైర్‌పర్సన్‌ తాతినేని పద్మావతి అధికారులకు సూచించారు. పీఎన్‌బీఎస్‌ సమావేశ మందిరంలో బుధవారం ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్సులు, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించాలని సూచించారు. కార్గో సర్వీసులకు సంబంధించి డోర్‌ డెలివరీ వంటి సేవల ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. మహిళా ఉద్యోగులకు దిశ యాప్‌పై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. విజిలెన్స్‌ వారోత్సవాలను పురస్కరించుకుని వచ్చే నెల ఒకటో తేదీ వరకు పౌరులతో సమగ్రతా ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు, కృష్ణా రీజియన్‌ ఆర్‌ఎంలు మాట్లాడుతూ టీం వర్క్‌ చేస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ రీజియన్‌ను లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో భాగంగా రీజియన్‌కు సంబంధించిన అన్ని సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ కార్డుల అమలులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (విజిలెన్స్‌) టి.శోభామంజరి, డిప్యూటీ సీటీఎంలు జె.శేషగిరిరావు, వి.నీలిమ, టీప్యూటీ సీఎంఈలు, అన్ని డిపోల మేనేజర్లు, అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని