ధైర్యంగా ఫిర్యాదు చేయండి : ఎస్పీ
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

ధైర్యంగా ఫిర్యాదు చేయండి : ఎస్పీ

మహిళల సమస్యలు వింటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి రోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విధితమే. నూజివీడు, నందిగామ సబ్‌ డివిజన్‌ ప్రాంతాలకు చెందిన ప్రజలకు మచిలీపట్నం దూరంగా ఉండటంతో ఫిర్యాదులు చేసేందుకు ఒకింత ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రతి బుధవారం నందిగామ, నూజివీడు సబ్‌ డివిజన్ల ప్రజలు, పోలీసు సిబ్బంది సమస్యలు తెలుసుకునేందుకు విజయవాడలోని ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఫీ. ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు.

* మైలవరానికి చెందిన ఓ వ్యక్తి.. తనను కొడుకే ఇంటి నుంచి గెంటివేశాడని ఫిర్యాదు చేశారు. తినేందుకు ఆహారం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు. ఎస్పీ స్పందించి, తక్షణం చట్టపరంగా న్యాయం చేయాలని మైలవరం సీఐని ఆదేశించారు.

పోలీసు సిబ్బందికి.. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, బదిలీలు తదితర సమస్యలను భయపడకుండా తెలియజేస్తే.. ఫిర్యాదులోని పారదర్శకత ఆధారంగా విధులు కేటాయిస్తానని ఎస్పీ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ సిబ్బంది అంతర్గత స్పందనలో సిబ్బందికి ఆయన పైవిధంగా హామీ ఇచ్చారు. పలువురు వచ్ఛి. తమ సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు. వాటికి తగిన పరిష్కారం చూపుతామని ఆయన భరోసా ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని