విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి : ఎస్‌ఎఫ్‌ఐ
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి : ఎస్‌ఎఫ్‌ఐ

ఇంటర్‌ విద్యా మండలి కమిషనర్‌కు వినతి పత్రం అందిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

మాచవరం, న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజలు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.కోటి, ఎం.సోమేశ్వరరావు బుధవారం ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఎం.శేషగిరిబాబుకు ఫిర్యాదు చేశారు. బుధవారం కళాశాలకు వచ్చిన ఆయన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలిసి, సమస్యలు వివరించారు. ఫీజులు కట్టని విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపుతున్నారని, పరీక్షలు రాయనివ్వడం లేదని ఆరోపించారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని కోరారు. అనుమతులు లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని విన్నవించారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బహిరంగంగా అధిక ధరలకు పుస్తకాల విక్రయిస్తున్నా.. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజమాన్యాల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఒ.ఏసుబాబు, కళాశాల శాఖ కార్యదర్శి రాధాకృష్ణ, నగర నాయకులు అభిషేక్‌, సుష్మ, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

‘నాడు-నేడు’ పనుల పరిశీలన

మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని ‘నాడు-నేడు’ పనులను ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఎం.శేషగిరిబాబు పరిశీలించారు. తరగతి గదుల్లో ఏర్పాటుచేసిన గ్రీన్‌ బోర్డులు, ఫ్లోరింగ్‌, బెంచీలు, టాయిలెట్స్‌ భవనాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనుల వివరాలను ప్రిన్సిపల్‌ సొంగా సరళకుమారి ఆయనకు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని