ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌గా దయాసాగర్‌
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌గా దయాసాగర్‌

ఈనాడు, అమరావతి: ఏపీ ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌గా మేకతోటి దయాసాగర్‌ నియమితులయ్యారు. 1992 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన దయాసాగర్‌ గతంలో ముంబై, హైదరాబాద్‌లో ఆదాయపన్నుశాఖ కమిషనర్‌గా పనిచేశారు. విజయవాడలోని ఆదాయపన్నుశాఖ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం బాధ్యతులు స్వీకరించారు. ఆదాయపన్నుశాఖ అధికారులు విజయవాడ జేసీఐటీ వినోద్‌ కన్నన్‌, విశాఖపట్నం జేసీఐటీ శంకర్‌, డీసీఐటీ చింతపల్లి మెహర్‌చాంద్‌ తదితరులు దయాసాగర్‌కు స్వాగతం పలికారు. రాష్ట్రంలో టీడీఎస్‌, పన్నుదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సేవలు అందిస్తామని దయాసాగర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని