‘ఛైల్డు ఇన్‌ఫోలో పేర్లు తొలగించాలి’
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

‘ఛైల్డు ఇన్‌ఫోలో పేర్లు తొలగించాలి’

ఈనాడు-అమరావతి

జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థుల పేర్లను చైల్డు ఇన్‌ఫోలో తొలగించాలని మండల విద్యాశాఖ అధికారులను డీఈఓ ఆర్‌.ఎస్‌.గంగాభవానీ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరతామని వచ్చే విద్యార్థులను చేర్చుకోకుండా ఇబ్బంది పెడుతున్న వైనంపై ‘ఈనాడు’లో ‘సర్కారు బడిలో చేరేదెలా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పాఠశాల విద్య సంచాలకులు చినవీరభద్రుడు స్పందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారీ పాఠశాలలో చేర్పిస్తామని ముందుకొస్తే చేర్చుకోవాలని, వెంటనే ఆ విద్యార్థి పేరు చైల్డు ఇన్‌ఫోలో తొలిగించాలని చెప్పినా ఇబ్బంది పెట్టడం తగదన్నారు. జిల్లాలో ఏం జరుగుతోందని డీఈఓకు చినవీరభద్రుడు ఫోన్‌ చేసి ప్రశ్నించారు. పేరెంట్‌ ఇచ్చే విల్లింగ్‌ లెటర్‌ ఆధారంగా వెంటనే ఆ విద్యార్థి పేరు డ్రాప్‌బాక్సులో పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన ఎంఈఓలను గుర్తించి నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుంటూరు డీవైఈఓ సుధాకర్‌రెడ్డి ఎంఈఓలకు ఫోన్లు చేసి మండలాల వారీగా కొత్త ప్రవేశాలు ఎన్ని? ఎంతమంది విద్యార్థులను డ్రాప్‌ బాక్సులో పెట్టారో ఆ వివరాలు తెలియజేయాలని కోరటంతో ఎంఈఓలు ఆందోళన చెందుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని