Ap News: తెదేపా అడ్డుతగిలినా సీఎం జగన్‌ వెంటే ప్రజలు: కన్నబాబు
eenadu telugu news
Published : 19/09/2021 15:49 IST

Ap News: తెదేపా అడ్డుతగిలినా సీఎం జగన్‌ వెంటే ప్రజలు: కన్నబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే సీఎం జగన్‌ విజయ పరంపర కొనసాగుతున్నట్లు అర్థమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు 80 శాతం ఫలితాలు వచ్చాయని.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతకుమించి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ప్రజాబలం ఉందని చెప్పేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

‘‘2018లోనే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చంద్రబాబు పెట్టలేదు. పరిషత్‌ ఎన్నికలు పెట్టాలని చూస్తే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారు. కొందరు అడుగడుగునా అడ్డుతగిలినప్పటికీ ప్రజలు సీఎం జగన్ వెంటే నడిచారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు, దుర్మార్గాలకు పాల్పడినట్లు తెదేపా ప్రచారం చేసింది. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సీఎం జగన్‌కు ప్రజలు వెన్నుదన్నుగా నిలబడ్డారు. సామాజిక న్యాయాన్ని చేతల ద్వారా చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్‌. ఇప్పటికైనా ఓటమికి కారణాలను తెలుసుకొని..
 రాష్ట్ర నిర్మాణాత్మక పరిపాలనకు తెదేపా సహకరిస్తే మంచిది’’ అని కన్నబాబు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని