ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ నూతన కార్యవర్గం
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ నూతన కార్యవర్గం


సమావేశంలో మాట్లాడుతున్న నూతన అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్‌, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ పొట్లూరి
భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌, కోశాధికారి ఎస్‌.అక్కయ్య నాయుడు

పటమట, న్యూస్‌టుడే: పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు పైడా కృష్ణ ప్రసాద్‌ అన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో శనివారం సంఘ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2021-23 కాలానికి కొత్త ఆఫీస్‌ బేరర్లు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శిగా బి.రాజశేఖర్‌, కోశాధికారిగా అక్కయ్య నాయుడు, సెంట్రల్‌ జోన్‌ ఉపాధ్యక్షుడిగా కల్లం మోహన్‌ రెడ్డి, విశాఖపట్నం జోన్‌ ఉపాధ్యక్షుడిగా ఎం.సుధీర్‌, రాయలసీమ ఉపాధ్యక్షుడిగా కె.వి.చౌదరి, సంయుక్త కార్యదర్శిగా సిద్ధార్థ్‌ చుక్కపల్లి, ఈసీ సభ్యులుగా పెరవలి కోటిరావు, దుర్గా ప్రసాద్‌, కె.కుమార్‌ రాజా, కె.వి.ఎస్‌.వర్మ, పి.శోభన్‌ ప్రకాష్‌ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఏపీ ఛాంబర్‌.. పరిశ్రమలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు కె.వి.ఎస్‌ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని