పరీక్షా ఫలితాలు విడుదల
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణావిశ్వవిద్యాలయం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ, బీటెక్‌ ఎనిమిదో సెమిస్టర్‌ ఫలితాలను ఉపకులపతి కె.బి చంద్రశేఖర్‌ ఆదేశాల మేరకు శనివారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.డి రామశేఖరరెడ్డి తెలిపారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ పునఃమూల్యాంకనం కోసం ఈనెల 28, బీటెక్‌ ఎనిమిదో సెమిస్టర్‌ కోసం 27వ తేదీలోపు నిర్దేశిత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. రిజిస్ట్రార్‌ ఎం.రామిరెడ్డి, యూజీ పరీక్షల సమన్వయకర్త డా.ఎం.శ్రావణి, పీజీ పరీక్షల సమన్వయకర్త డా.ఇ.భవానీ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని