కొండవీటి వాగు వద్ద యువకుడి గల్లంతు!
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

కొండవీటి వాగు వద్ద యువకుడి గల్లంతు!


ఘటనా ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి, సీఐ సుబ్రహ్మణ్యం

తాడేపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం ఈతకు దిగిన నలుగురిలో ఓ యువకుడు గల్లంతయ్యాడంటూ వచ్చిన సమాచారంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎత్తిపోతలకు సమీపంలో నలుగురు యువకులు కృష్ణానదిలో ఈతకు దిగారు. వరద ఉద్ధృతి పెరగడంతో ముగ్గురు లోటస్‌ ఫుడ్‌సిటీ వరకు వచ్చి ఒడ్డుకు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడనే సమాచారం వ్యాపించడంతో అధికారులు ఘటనా ప్రదేశాన్ని రాత్రి పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో కూడా మరో ముగ్గురు నదిలో ఈతకు దిగి నీటి ఒరవడికి బయట పడినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. నదిలో దిగిన యువకులు ఎవరు? గల్లంతైన వ్యక్తి ఎవరై ఉండొచ్చు? నిజంగా నదిలో గల్లంతయ్యాడా? ఎటువైపు నుంచైనా ఒడ్డుకు చేరాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డి, సీఐ సుబ్రమణ్యం, ఆర్‌ఐ వంశీ, పోలీసు సిబ్బంది పరిశీలించి ఘటనలపై ఆరాతీశారు. దీనిపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని