‘ఇండియా టుడే’ ర్యాంకుల్లో ఏఎన్‌యూ సత్తా
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

‘ఇండియా టుడే’ ర్యాంకుల్లో ఏఎన్‌యూ సత్తా

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ‘ఇండియా టుడే’ ప్రకటించిన జాతీయ ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 15, అత్యధిక పేటెంట్లు దాఖలు చేసిన కేటగిరీలో 1, అత్యధిక పేటెంట్లు ప్రచురించిన విభాగంలో 2వ ర్యాంకులను కైవసం చేసుకుంది. గతేడాదితో పొల్చితే రెండు స్థానాలు పైకి ఎగబాకింది. 2020లో ఏఎన్‌యూ 17వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది మరో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని పేర్కొంటూ ఇందుకు కృషిచేసిన అధ్యాపకులకు శుభాకాంక్షలు చెప్పారు. రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనలు చేసి ర్యాంకులు రావడానికి దోహదం చేసిన పరిశోధకులకు అభినందనలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని