జిల్లా కార్యవర్గం ఎన్నిక
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

జిల్లా కార్యవర్గం ఎన్నిక


బ్రహ్మారెడ్డిని అభినందిస్తున్న రామిరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సామాజిక ఆరోగ్య అధికారుల, బహుళ ప్రయోజన ఆరోగ్య విస్తరణాధికారుల జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవరగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం కార్యదర్శి ప్రసాదస్వామి తెలిపారు. ఎన్జీవో సంఘం సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బ్రహ్మారెడ్డి(తుళ్లూరు), కార్యదర్శిగా ప్రసాదస్వామి(తెనాలి), కోశాధికారిగా రామకృష్ణారావు(గుంటూరు), ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు(రాజుపాలెం), శ్రీనివాస్‌(ఎస్‌జేమూడి), చంద్రశేఖర్‌(రొంపిచర్ల), శాంసన్‌(చండ్రాజుపాలెం), మనోహర్‌(నూతక్కి), సంయుక్త కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు(నూజెండ్ల), చుక్కా వెంకటేశ్వర్లు(ఫణిదం), బాలచంద్రమౌళి(మున్నంగి), మల్లికార్జునరావు(కొల్లూరు), మంగరాజు(గుంటూరు), నిర్వాహక కార్యదర్శులుగా లూర్దురాజు(నుదురుపాడు), శ్రీనివాసరెడ్డి(గాదేవారిపాలెం), శ్రీమన్నారాయణ(మంగళగిరి), రమణరావు(జి.ముప్పాళ్ల), మహబూబ్‌వలి(విశ్వేశ్వరం) ఉన్నారు. నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేషగిరిరాజు, ఉపాధ్యక్షుడు ఆనందరావు, జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని