సరదా కోసం వెళ్లి బాహాబాహీ..!
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

సరదా కోసం వెళ్లి బాహాబాహీ..!

నడి రోడ్డుపై రెండు వర్గాల పరస్పర దాడులు


ఘర్షణ పడుతున్న యువకులు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని జూపూడి శివారు ఎన్టీటీపీఎస్‌ బూడిద చెరువు వద్ద ఆదివారం సాయంత్రం యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు గాయపడ్డాడు. సేకరించిన సమాచారం ప్రకారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా విజయవాడకు చెందిన కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై బృందాలుగా జనసంచారం అంతగా ఉండని బూడిద చెరువు వద్దకు వచ్చారు. చెరువు అలుగు పైనుంచి నీరు వాటరు ఫాల్స్‌ తరహాలో కిందకు పడుతుంటుంది. ఆ నీటిలో ఆటలాడే క్రమంలో యువకుల మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఓ బృందానికి చెందిన యువకులు అక్కడి నుంచి జాతీయ రహదారి సమీపంలోకి వచ్చి వీరితో తగాదా పడిన వారి కోసం ఎదురు చూడసాగారు. కొంత సేవటికి వారు రావడంతో వీరు వారిపై దాడి చేశారు. ప్రత్యర్థి బృందం ప్రతిఘటించింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒక యువకుడు గాయపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన వారు గాయపడిన యువకుడిని తీసుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఘర్షణలో పాల్గొన్న వారి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని