కార్మిక ఉద్యమనేత వి.వి.రామారావు ఇక లేరు
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

కార్మిక ఉద్యమనేత వి.వి.రామారావు ఇక లేరు

 

విశాఖపట్నం, న్యూస్‌టుడే: కార్మిక ఉద్యమ నేత, సీపీఐ సీనియర్‌ నాయకుడు వి.వి.రామారావు (74) మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 8.30 గంటలకు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన సన్నిహితులు ధ్రువీకరించారు. కార్మికోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఆయన అఖిల భారత పోర్టు, డాక్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా, విశాఖ హార్బర్‌, పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ అగ్రనాయకుడిగా ఉద్యమ నిర్మాణాల్లో ముఖ్యపాత్ర పోషించారు. అంతే కాకుండా విశాఖపట్నం హార్బర్‌ అండ్‌ పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడుగా, సీపీఐ విశాఖ కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడుగా, జాతీయ సమితి సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. స్వస్థలం కృష్ణా జిల్లా కైకలూరు మండలం భైరవపట్నం. ఈయన మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని