లంకెవానిదిబ్బ దుర్ఘటనపై విచారణ
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

లంకెవానిదిబ్బ దుర్ఘటనపై విచారణ

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే : రేపల్లె మండలం లంకెవానిదిబ్బ శివారులో బెయిలీ ఆక్వా ఫాం రొయ్యల చెరువు వద్ద చోటుచేసుకొన్న ఘటనపై 174 సెక్షన్‌ కింద అనుమానాస్పద మృతిగా చోడాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు విచారణ చేస్తున్నారు. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వలన లేదా రసాయనాల కారణంగా ప్రమాదం జరిగిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఫొరెన్సిక్‌ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆదివారం తెలిపారు. తమ సహచరులు ఆరుగురు మృతిచెందడంతో భయాందోళనకు గురైన మిగతా యువకులు 35 మంది శనివారం ప్రత్యేక బస్సులో ఒడిశాలోని స్వగ్రామాలకు వెళ్లారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని