కరకట్ట విస్తరణ పనుల అడ్డగింత
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

కరకట్ట విస్తరణ పనుల అడ్డగింత

తాడేపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా కుడి కరకట్ట విస్తరణ కోసం ఉండవల్లి పరిధిలో ముళ్లకంప తొలగింపు పనులను ఆదివారం రైతులు అడ్డుకున్నారు. విస్తరణలో భాగంగా గుత్తేదారులు రొయ్యల చెరువు సమీపంలో పొక్లెయిన్‌ ద్వారా కరకట్ట దిగువున పంట పొలాల వద్ద ఆదివారం ముళ్ల కంప తొలగిస్తున్నారు. తమ అనుమతి లేకుండా తమ పొలాల వద్ద కంపలు తొలగించవద్దంటూ రైతులు వారిని అడ్డుకున్నారు. రైతులతో చర్చించిన తరువాతే తమ పొలాల వద్దకు రావాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో తమ అనుమతి లేకుండా పంట పొలాల్లో రాళ్లు పాతారని రైతులు తెలిపారు. రాజధాని భూసమీకరణకోసం ఇచ్చిన తమ భూములకు ప్రతిఫలంగా ఇంతవరకూ ప్లాట్లు కేటాయించనందున తమ భూముల్లోకి రావద్దంటూ సూచించారు. ఆయా ప్రాంతాల పరిశీలనకు ఏపీ రైతు సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం పర్యటించనున్నట్లు సంఘం ఉండవల్లి అధ్యక్షుడు కొర్రప్రోలు ఈశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని