AP News: స‌ర్కారువి కాకి లెక్క‌లు: రామ‌కృష్ణ‌
logo
Updated : 15/06/2021 14:55 IST

AP News: స‌ర్కారువి కాకి లెక్క‌లు: రామ‌కృష్ణ‌

అమ‌రావ‌తి: క‌రోనా మ‌ర‌ణాలపై ఏపీ ప్ర‌భుత్వం కాకి లెక్క‌లు చెబుతోందని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ విమ‌ర్శించారు. మే నెల‌లో రాష్ట్రంలో చోటు చేసుకున్న‌ మ‌ర‌ణాల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క మే నెల‌లోనే ఏపీలో 1.30 లక్ష‌ల మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా.. అందులో కేవ‌లం మూడు వేల మంది మాత్ర‌మే కరోనాతో మ‌ర‌ణించార‌ని స‌ర్కారు చెప్ప‌డం విడ్డూర‌మ‌న్నారు. ఏటా మే నెల‌లో జ‌రిగే సాధార‌ణ మ‌ర‌ణాల కంటే ఈ ఏడాది 400 శాతం అధికంగా జ‌ర‌గ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. రాష్ట్రంలో కొవిడ్‌తో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని రామ‌కృష్ణ డిమాండ్ చేశారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని