తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం
logo
Published : 15/06/2021 04:06 IST

తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం


కొత్త శాఖను ప్రారంభిస్తున్న సంస్థ జోనల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: స్థానిక నల్లచెరువు మూడో వీధిలోని మహవీర్‌ కళాశాల ఎదురుగా కనకదుర్గ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన కనకదుర్గ గోల్డ్‌ లోన్స్‌ 17వ శాఖను సోమవారం ప్రారంభించారు. వ్యాపార, వక్తిగత అవసరాలకు గత 40 ఏళ్లుగా అనేకమంది వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు ఆ శాఖ జోనల్‌ మేనేజర్‌ ఎ.వరప్రసాద్‌ తెలిపారు. ఆర్బీఐ గుర్తింపు పొందిన తమ సంస్థలో అతి తక్కువ వడ్డీకే వినియోగదారులకు ఫైనాన్స్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, నగరవాసులు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని