ప్రాథమిక పాఠశాలల విభజన నిర్ణయం విరమించుకోవాలి: ఫ్యాప్టో
logo
Published : 15/06/2021 04:06 IST

ప్రాథమిక పాఠశాలల విభజన నిర్ణయం విరమించుకోవాలి: ఫ్యాప్టో

జేసీ ప్రశాంతికి వినతిపత్రం అందజేస్తున్న ఫ్యాప్టో నాయకులు

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాథమిక పాఠశాలల విభజన నిర్ణయం వెంటనే విరమించుకోవాలని ఫ్యాప్టో ఛైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ కె.బసవలింగారావు, కె.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో నాయకులు నిర్మాణాత్మక ప్రతిపాదనలతో సంయుక్త పాలనాధికారి పి.ప్రశాంతి, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవానీ, పాఠశాల విద్య ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 5+3+3+4 విద్యా విధానం తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత/ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీని వల్ల బాలికలు, దివ్యాంగులు బడి మానేసే ప్రమాదం ఉందన్నారు. ఈ విభజన జాతీయ విద్యా విధానం-2020, విద్యా హక్కు చట్టం-2009లకు వ్యతిరేకమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలో అంగన్‌వాడీలను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయడం మంచి విషయమన్నారు. విద్యార్థుల సంఖ్య 400పైగా దాటిన పాఠశాలలను +2గా అప్‌గ్రేడ్‌ చేయాలని, విద్యార్థుల సంఖ్య 75 దాటిన యూపీలను ఉన్నత పాఠశాలలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. మౌలిక మార్పులు, చేర్పులు చేసేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, అందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా తల్లిదండ్రుల కమిటీలతో విస్తృత స్థాయి చర్చ జరపాలని కోరారు. ఫ్యాప్టో కో-ఛైర్మన్లు పి.ప్రేమ్‌కుమార్‌, రామచంద్రయ్య, కార్యవర్గ సభ్యులు కళాధర్‌, పెదబాబు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని