మిర్చియార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభం
logo
Published : 15/06/2021 04:06 IST

మిర్చియార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభం


మిర్చి నాణ్యతను పరిశీలిస్తున్న వ్యాపారులు

మిర్చియార్డు, న్యూస్‌టుడే: గుంటూరు మిర్చియార్డులో మిర్చి క్రయవిక్రయాలు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. కరోనా ఉద్ధృతి కారణంగా గత నెల 3న యార్డుకు సెలవులు ప్రకటించారు. అప్పటి నుంచి గత వారాంతం వరకు శీతలగిడ్డంగులు, గోదాముల్లో లావాదేవీలు కొనసాగించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో యార్డులో లావాదేవీలు ప్రారంభించారు. చిలకలూరిపేట, నరసరావుపేట రహదారుల వైపున ఉన్న గేట్ల ద్వారా మిర్చి బస్తాలను యార్డులోకి అనుమతిస్తున్నారు. మాస్కు ధరించిన వారినే యార్డు లోపలకు అనుమతిస్తున్నారు. రెండు, ఏడు గేట్ల వద్ద శానిటైజ్‌ చేస్తున్నారు. మిర్చియార్డుకు మొత్తం 32,917 బస్తాలను రైతులు తరలించగా 27,541 బస్తాలు క్రయవిక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 5,800 బస్తాలు నిల్వ ఉన్నాయి. గత సీజన్‌లో శీతల గిడ్డంగుల్లో మిర్చిని నిల్వ చేసుకున్నారు. ఇప్పుడు నిల్వ ఉన్న మిర్చి గిరాకీ పలుకుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని