చిరు వ్యాపారులు... ట్రాఫిక్‌ చక్కదిద్దారు
logo
Published : 15/06/2021 03:56 IST

చిరు వ్యాపారులు... ట్రాఫిక్‌ చక్కదిద్దారు

నిత్యం అంబులెన్సులతో, ఆసుపత్రికి వచ్చేవారితో రద్దీగా ఉండే నక్కలరోడ్డు ఆంధ్ర హాస్పిటల్‌ హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ కూడలి సోమవారం విపరీతమైన ట్రాఫిక్‌తో స్తంభించింది. ఇందులో అంబులెన్సులు సైతం ఇరుక్కున్నాయి. దీంతో అక్కడే ఉన్న జామ, మామిడి అమ్మే చిరువ్యాపారులే ట్రాఫిక్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. నెమ్మదిగా అంబులెన్సులను వెళ్లేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ ఆదర్శంగా నిలిచారు. చిత్రమేమిటంటే ఆ వాహనాల మధ్యలో నుంచే పోలీసులు కుయ్‌ కుయ్‌ మని సైరన్‌ వేసుకుంటూ వెళ్లిపోయారే కానీ ట్రాఫిక్‌ నియంత్రించడంలో సహాయం చేయలేదు.

-ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని