ధాన్యం బకాయిల చెల్లింపుల్లో జాప్యం తగదు
logo
Published : 15/06/2021 03:34 IST

ధాన్యం బకాయిల చెల్లింపుల్లో జాప్యం తగదు

పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న కౌలు రైతు సంఘం నాయకులు

కానూరు, న్యూస్‌టుడే : రబీలో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లోకి వెంటనే జమ చేయాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య అన్నారు. సోమవారం అశోక్‌నగర్‌లోని రాష్ట్ర పౌర సరఫరాల కార్యాలయం వద్ద కౌలు సంఘం, రైతు సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా ముప్పు ఉన్నప్పటికీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రైతులు, కౌలు రైతులు ధాన్యం పండించి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారన్నారు. కొనుగోలు చేసిన 72 గంటల్లో నగదు రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పి రెండు నెలలు గడిచినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ క్వింటాకు 10 నుంచి 15 కిలోల తరుగుతీసి రైతు కష్టార్జితాన్ని దోచుకోవడం దారుణమన్నారు. జిల్లాలో రైతులకు మొత్తం రూ.500 కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. అనంతరం రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శిరీషకు నాయకులు వినతి పత్రం అందజేశారు. కౌలు రైతు సంఘం నాయకులు రంగారావు, మరియదాసు, నాగేశ్వరరావు, శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని