ఆర్టీసీ అభివృద్ధికి సమన్వయంతో కృషి
logo
Published : 15/06/2021 03:34 IST

ఆర్టీసీ అభివృద్ధికి సమన్వయంతో కృషి


కార్గో సర్వీసుల విడిభాగాలను పరిశీలిస్తున్న ద్వారకాతిరుమలరావు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: ఆర్టీసీ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో కృషి చేయాలని ఏపీఎస్‌ ఆర్టీసీ వీసీ అండ్‌ ఎండీ ద్వారకాతిరుమలరావు అన్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విద్యాధరపురంలోని డిపో, జోనల్‌ వర్కుషాపు, శిక్షణ అకాడమీ, టైర్‌ రీట్రేండింగ్‌ విభాగాలను సోమవారం సందర్శించారు. డిపో ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం ఎండీ మాట్లాడుతూ.. కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు, ఉద్యోగుల భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. టిమ్స్‌ మిషన్ల రూపకల్పన, సంస్థలో అమలు జరుగుతున్న సులభతరమైన విధానాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. పల్లె వెలుగు బస్సులను ఆధునికీకరించి కార్గో సర్వీసులుగా వినియోగించేందుకు సిద్ధం చేసిన ప్రణాళికను పరిశీలించారు. నమ్మకమైన సేవలు ఆర్టీసీ అందించే విధంగా వాహనాలను రూపొందించాలని సూచించారు. శిక్షణ అకాడమీ, టైర్‌ రీట్రేడింగ్‌ విభాగాలను తనిఖీ చేసి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఆర్టీసీ అభివృద్ధి చెందాల్సిన అవసరంపై ఆసక్తి చూపుతున్నారన్నారు. ఉద్యోగులందరు కుటుంబసభ్యులుగా భావించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థ మనుగడ, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. డిపోలో ఉత్తమ కేఎంపీఎల్‌ సాధించిన డ్రైవర్లను ఈపీకే తీసుకువచ్చిన కండక్టర్లను ఈ సందర్భంగా అభినందించారు. రీజనల్‌ మేనేజర్‌ నాగేంద్రప్రసాద్‌, డిపో మేనేజర్‌ రూపశ్రీ, వర్కుషాపు వర్క్సు మేనేజర్‌ వాణిశ్రీ, ఈడీలు కృష్ణమోహన్‌, బ్రహ్మానందరెడ్డి, సీఎంఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని