‘బెదిరింపులకు తలొగ్గేది లేదు’
logo
Published : 15/06/2021 03:34 IST

‘బెదిరింపులకు తలొగ్గేది లేదు’


నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు, వివిధ సంఘాల నాయకులు

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, పోలీసులతో నిర్బంధించాలని చూసినా, బెదిరించినా తలొగ్గేది లేదని మున్సిపల్‌ కార్మికులు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ధర్నాచౌక్‌లో ఏపీ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు మాట్లాడుతూ.. కరోనా నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మున్సిపల్‌ కార్మికులు వేడుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50లక్షల బీమా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ల బకాయిలు ఇవ్వాలన్నారు. కడప, అనంతపురం జిల్లాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, సీపీఎం జిల్లా నాయకుడు డి.కాశీనాథ్‌, నగర నాయకులు ఎం.డేవిడ్‌, కార్పొరేటర్‌ బోయి సత్యబాబు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని