రక్తదానం.. ప్రాణదానంతో సమానం
logo
Published : 15/06/2021 03:34 IST

రక్తదానం.. ప్రాణదానంతో సమానం


కరపత్రాలు ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ గీతా ప్రసాదిని, డాక్టర్‌ సుహాసిని, డాక్టర్‌ సమరం, ఉషారాణి, ఎయిడ్స్‌, రెడ్‌క్రాస్‌ సంస్థ సభ్యులు

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : రక్తదానంతో ప్రపంచాన్ని బతికించాలని, ఇది ప్రాణదానంతో సమానమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ గీతాప్రసాదిని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హనుమంతరాయ గ్రంథాలయంలో కృష్ణా జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ, నిర్మూలన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సకాలంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ముఖ్యంగా యువత ముందుండాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్‌ సుహాసిని మాట్లాడుతూ.. ప్రస్తుతం రక్తం కొరత అధికంగా ఉందని, యువత రక్తదానంతో నిల్వలు పెంచాలని సూచించారు. రెడ్‌ క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ డాక్టర్‌ సమరం మాట్లాడుతూ.. జనాభాలో ఒక్క శాతం మంది రక్తదానం చేసినా కొరతను అధిగమించవచ్చన్నారు. జిల్లా ఎయిడ్స్‌, లెప్రసీ వైద్యాధికారిణి డాక్టర్‌ జె.ఉషారాణి మాట్లాడుతూ.. కరోనా సమయంలోనూ యువకులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు దాతలను సత్కరించారు. కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. డాక్టర్‌ గీతాప్రసాదిని రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ సభ్యులు డాక్టర్‌ రమాదేవి, పీటర్‌పాల్‌, పి.కిరణ్‌, అరవ రమేష్‌, ఎన్టీవో, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని