మీ ప్రేమ మాకు చాలా విలువైనది: జాన్వీ - your love is so precious to us: janvi
close
Updated : 24/02/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ ప్రేమ మాకు చాలా విలువైనది: జాన్వీ

ఇంటర్నెట్‌ డెస్క్:  అందాల నాయిక శ్రీదేవి కన్నుమూసి, చూస్తుండగానే మూడేళ్లు గడిచాయి. ఆమె కన్నుమూసి మూడేళ్లయిన సందర్భంగా బోనీ కపూర్‌ తన కూతుళ్లతో కలిసి చెన్నైలోని మైలాపూర్‌ నివాసంలో ఈరోజు ఆమె జ్ఞాపకార్థం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి 2018 దుబాయ్‌లో బోనీకపూర్‌ మేనల్లుడు మోహిత్‌ మార్వా పెళ్లికి హాజరై,  ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించిచిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల తర్వాత జాన్వీ కపూర్‌ తన తల్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ...‘‘నా హృదయంలో ఆమెకు పవిత్ర స్థానం ఉంది. ఇకపై నేను జీవించడం కొత్తగా నేర్చుకోవలసి ఉంటుంది. ఈ శూన్యంలోనూ మీరు నన్ను ముందుకు నడిపిస్తారు. నేను కళ్లు మాసుకున్న ప్రతిసారీ మీరు చెప్పిన మంచి విషయాలు మాత్రమే నాకు గుర్తుకొస్తున్నాయి. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ కలిగి ఉంటాం. చాలా స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉన్నారు.  మీరు ఈ ప్రపంచం కోసం ఉన్నారు. అందుకే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లారు’’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ రాజ్‌ కుమార్‌రావ్‌, వరుణ్‌ శర్మలతో కలిసి ‘రూహీ’ చిత్రంతో పాటు ‘గుడ్‌ లక్‌ జెర్రీ’, ‘దోస్తానా2’లోనూ నాయికగా నటిస్తోంది. 

ఇవీ చదవండి: 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని