RamGopal Varma: ప్రియురాలి పేరునే శ్రీదేవికి పెట్టుకున్న ఆర్జీవీ - telugu cinema news ramgopal varma about rangeela movie
close
Published : 26/08/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RamGopal Varma: ప్రియురాలి పేరునే శ్రీదేవికి పెట్టుకున్న ఆర్జీవీ

హైదరాబాద్‌: అతిలోక సుందరి, అలనాటి నటి శ్రీదేవి అంటే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అమితమైన అభిమానం. ఆ ఇష్టంతోనే ‘క్షణ క్షణం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల్లో శ్రీదేవినే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కాగా, వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి పాత్రకు ‘సత్య’ అనే పేరు పెట్టడం వెనుకున్న కథను తాజాగా ఆర్జీవీ వెల్లడించారు. తన ప్రేమ కథ గురించి తొలిసారి నెటిజన్లకు తెలియజేశారు. అంతేకాకుండా తను ఇష్టపడిన మహిళ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

‘నా జీవితంలో మొట్టమొదటి ప్రేయసి పేరు సత్య. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఆమెతో ప్రేమలో పడ్డాను. తను మెడికల్‌ స్టూడెంట్‌. ఆ రోజుల్లో మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఒకేచోట ఉండేవి. అక్కడే సత్యతో నా వన్‌ సైడ్‌ లవ్‌ మొదలైంది. వేరే డబ్బున్న కుర్రాడు కారణంగా తను నా ప్రేమను పట్టించుకోదని భావించాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అదే స్టోరీతో ‘రంగీలా’ చిత్రాన్ని తెరకెక్కించాను. అది ఒక్కటే కాదు ‘సత్య’, ‘క్షణక్షణం’లో శ్రీదేవి పాత్ర పేరు కూడా ఈమెను ఉద్దేశించే పెట్టాను’ అని వర్మ వివరించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని